calender_icon.png 6 February, 2026 | 1:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హోరెత్తిన ప్రచారం.. అభివృద్ధి పథకాలతో కాంగ్రెస్

06-02-2026 12:04:20 AM

అధికార పాత్ర వైఫల్యాలతో ప్రతిపక్షాలు..

ఓటర్లను ఆకట్టుకునేందుకు పాట్లు..

భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 5, (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను కల్పిస్తే సంక్షేమ అభివృద్ధి పథకాలు మరింత ముందుకు సాగుతాయని అధికార పార్టీ నేతలు, రెండేళ్ల కాంగ్రెస్ పార్టీ పాలనలో బూటకపు వాగ్దానాలు, మోసపూరిత హామీలతో  డైవర్షన్ పొలిటికల్ తో కాలయాపన చేస్తున్నాయి అంటూ విపక్షాలు ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు పాట్లు పడుతున్నారు. మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీలకు ఎన్నికలు సమర్పిస్తున్న వేళ జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. 

కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి...

మంత్ర పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 

రెండేళ్ల పాలనలో రాష్ట్రంలో అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను అమలు చేస్తూ ప్రజా ప్రభుత్వమైన  ఇందిరమ్మ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. పట్టణాల్లో ప్రజా సమస్యలు సత్వర పరిష్కారం జరగాలన్న, అభివృద్ధి సంక్షేమ పథకాలు అర్హులకు దరిచేరాలన్న మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులకు తమ అమూల్యమైన ఓట్లు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు.

మోసపూరిత హామీలతో అధికారం 

ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

గురువారం బిఆర్‌ఎస్ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కొత్తగూడం పాల్వంచ మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్లలో విస్తృత ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఆచరణ సాధ్యం కానీ హామీల నుంచి ప్రజలను మోసం చేసిందని, మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక కార్పోరేటర్లను, మున్సిపల్ వార్డు మెంబర్లను గెలిపించి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఆయన వెంట మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, వనమా రాఘవేందర్రావు, బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులు పాల్గొన్నారు. బిఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాల వాళ్ళ అభివృద్ధి ఏమాత్రం ముందుకు సాగదని, దొందూ దొందెనంటూ బిజెపి నాయకులు ప్రచారాన్ని సాగిస్తున్నారు. కొత్తగూడెం కార్పొరేషన్ డివిజన్లో బిజెపి బలపరిచిన అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారాన్ని నిర్వహించారు. 

మున్సిపాలిటీల్లో ఓట్లు అడిగే హక్కు తమదే 

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు 

కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ లో ఓట్లను అడిగే హక్కు తమ ఉందని, 25 ఏళ్ల పాటు పాల్వంచకు ఎన్నికలు లేకుండా చేసిన కాంగ్రెస్ బిజెపి టిఆర్‌ఎస్ పార్టీలను ఈ ఎన్నికల్లో చిత్త చిత్తగా ఓడించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు, పార్టీ రాష్ట్ర జిల్లా కార్యదర్శి షాబీర్ పాషా పిలుపునిచ్చారు. సిపిఐ బలపరిచిన అభ్యర్థుల విజయానికాంక్షిస్తూ పలు డివిజన్లో ప్రచారాన్ని నిర్వహించారు.