calender_icon.png 6 February, 2026 | 1:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బసవతారకం ఆసుపత్రి అరుదైన మైలురాయి

06-02-2026 12:02:50 AM

ఖైరతాబాద్,ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో-అమె రికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ దేశవ్యాప్తంగా క్యాన్సర్ సంరక్షణను బలోపేతం చేయడంలో మరో కీలక అడుగు వేసింది. తమిళనాడు ప్రభుత్వ వైద్యశాలల్లో పనిచేస్తున్న సర్జికల్ ఆంకాలజిస్టుల కోసం గైనకలాజికల్ ఆంకాలజీలో ప్రత్యేక శస్త్రచికిత్స శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు.

సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ, తమిళనాడు ప్రభుత్వ ఆరోగ్య శాఖ సంయుక్తంగా చేపట్టిన ‘టిఎన్‌ఎన్సిడి (ఆంకాలజీ) ప్రాజెక్ట్‘లో భాగంగా ఈ శిక్షణ జరిగింది. గైనకలాజికల్ క్యాన్సర్ బాధితులకు మెరుగైన చికిత్స అందించేలా ప్రభుత్వ రంగ వైద్యుల నైపుణ్యాలను పెంపొందించడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశ్యమని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బసవతారకం మెడికల్ డైరెక్టర్ డాక్టర్ టి. సుబ్రహ్మణ్యేశ్వర రావు, డాక్టర్ ఆర్. రాజగోపాలన్, డాక్టర్ జీబా ఉసోఫీ తదితరులు పాల్గొన్నారు.