29 June, 2026 | 1:34 AM

రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ, విద్యుత్ శాఖల అధికారులపై హైడ్రా కేసులు నమోదు చేయాలి

29-06-2026 12:38 AM

సికింద్రాబాద్, జూన్ 28 (విజయ క్రాం తి): ఓల్డ్ బోయిన్ పల్లి పరిధిలోని హస్మత్ పేట్ సర్వే నంబర్ 1 లో గల పురావస్తు శాఖకు చెందిన ప్రభుత్వ భూమిలో సాగుతున్న అక్రమ నిర్మాణాలపై స్థానికులు, ప్రజాసంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పురావస్తు శాఖ భూములను ఆక్రమించి పక్కా గృహాలు నిర్మిస్తున్నా అధికారులు పట్టించు కోకపోవడం పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రభుత్వ భూమి అని తెలిసి కూడా రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ, విద్యుత్ శాఖల అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ, ఆయా నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేయడంపై సర్వ త్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నియమనిబంధనల ను పూర్తిగా తుంగలో తొక్కి అక్రమ నిర్మాణాలకు తాగునీరు, విద్యుత్ కనెక్షన్లు ఎలా ఇస్తారని స్థానిక నాయకులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. తక్షణమే స్పం దించి ఆయా కనెక్షన్లను నిలిపివేయడంతో పాటు,అక్రమ నిర్మాణాలను తొలగించాలని స్థానికులు డిమాండ్ చేశారు.

ఆక్రమణదారులకు కొమ్ముకాస్తూ, విధుల్లో నిర్లక్ష్యం వహిం చిన సంబంధిత అధికారులపై ప్రభుత్వ ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ భూమి అమ్మి సొమ్ము చేసుకున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకో వాలని డిమాండ్ చేశారు. పేదలు ఇళ్ల కోసం ఎదురుచూస్తుంటే, మరోవైపు విలువైన ప్ర భుత్వ భూములు ఆక్రమణల పాలు కావ డం దుర్మార్గమన్నారు.

ఇప్పటికైనా ప్రభు త్వం స్పందించి, ఆక్రమణలను అడ్డుకుని ప్రభుత్వ భూమిని కాపాడాలని విజ్ఞప్తి చేశా రు. ఇక్కడ ఇండ్లు నిర్మాణం చేసుకుని జీవిస్తున్న అర్హులైన పేదప్రజలు ప్రభుత్వం సా యం చేయాలని కోరారు. కొద్ది మంది మో సగాళ్లు ఉచ్చులో చిక్కుకుని రోడ్డు పాలైన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చి ఆదుకోవాలన్నారు.నిజమైన పేద ప్రజలకు ఇంది రమ్మ ఇళ్లను కేటాయించి న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు..