29 June, 2026 | 1:34 AM

వైభవంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠ

29-06-2026 12:38 AM

ప్రత్యేక పూజలు చేస్తున్న వైస్ చైర్మన్ 

మిర్యాలగూడ, జూన్ 28 : పట్టణంలోని సబ్ జైలు రోడ్డులో నూతనoగా నిర్మాణం చేసిన శ్రీ మహాలక్ష్మి దేవాలయం ద్వజ స్తంబ ప్రతిష్ట ఆదివారం శాస్త్రోక్తంగా జరిగింది. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మా రెడ్డి సహా ఆలయ నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో ముందుగా ధ్వజ స్తంబానికి ప్రత్యేక పూజలు చేసిన అర్చకు స్వాములు భక్తులందరి చేత అభిషేక పూజలు జరిపించారు.

అనంతరం భారీ క్రెన్ సాయంతో ద్వజ స్తంబ ప్రతిష్ట నిర్వహించారు. అదేవిధంగా పట్టణంలోని అమ్మవారి వద్ద ప్రత్యేక పూజలను మున్సిపల్ వైస్ చైర్మన్  గుడిపాటి శిరీష నవీన్ కుమార్ చేశారు.  కార్యక్రమంలో ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి, అధ్యక్షులు కోడి వెంకటయ్య యాదవ్, పుల్లెల వాసు చౌదరి తదితరులు పాల్గొన్నారు.

సర్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలి

ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి 

దామరచర్ల,:జూన్ 28 : మండల కేంద్రంలో నిర్వహించిన సర్ కార్యక్రమంపై ఆదివారం నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సంఘం చేపట్టిన  సర్ కార్యక్రమాన్ని బాధ్యతాయుతంగా నిర్వహించి ప్రతి అర్హత ఓటరు పేరు ఓటరు జాబితాలో ఉండేలా కృషి చేయాలని సూచించారు.అర్హులైన ఓటర్ల నమోదు, వివరాల సవరణ, చిరునామా మార్పులు, తొలగింపులు వంటి అంశాల్లో ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని  దిశానిర్దేశం చేశారు..

ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, సర్పంచులు, సమన్వయంతో పనిచేసి ఒక్క అర్హ ఓటరు కూడా జాబితా నుంచి మినహాయింపుకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు..ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటరు జాబితా ఎంతో కీలకమని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పనిచేయాలని పిలుపునిచ్చారు..ఈ సమావేశంలో మండల  కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, బి ఎల్ ఏ లు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..