దౌర్జన్యాలకు వేదికగా హైడ్రా
బీజేపీ రాష్ట్ర చీఫ్ రాంచందర్‌రావు
హైదరాబాద్, జూలై 27 (విజయక్రాంతి): హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను ఆ పోస్టు నుం చి తక్షణమే తప్పించాలన్న హైకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అ ధ్యక్షుడు రాంచందర్‌రావు పేర్కొంటూ సోమవారం ప్రకటన విడుదల చేశారు.
ఈ తీర్పు ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ పాలన సాగిస్తు న్న రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదన్నారు. సామాన్య ప్రజలను, రైతులను భయభ్రాంతులకు గురిచే స్తూ, అక్రమ నిర్మాణాల పేరుతో దౌర్జన్యాలకు వేదికగా మారిన ఈ హైడ్రా వ్యవస్థను ప్రభు త్వం తక్షణమే పూర్తిగా ఎత్తివేయాలని డిమాం డ్ చేశారు. ఏకంగా 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలయ్యాయంటే, ఈ ప్రభుత్వంతో పాటు అధికారులు కోర్టులను ఏ స్థాయిలో నిర్లక్ష్యం చేశారో అర్థమవుతోందని చెప్పారు.






