calender_icon.png 24 February, 2026 | 4:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్లోబల్ వాల్యూ క్రియేషన్.. హబ్‌గా హైదరాబాద్

24-02-2026 01:40:08 AM

  1. రెడీ టూ వర్క్ ఫోర్స్‌గా తెలంగాణ యువత
  2. ఆవిష్కరణలకు ఊతమిచ్చే ఇన్నోవేషన్ ఎకో సిస్టం 
  3. ది హార్ట్ ఫోర్డ్ ఇండియా టెక్నాలజీ సెంటర్ ప్రారంభోత్సవంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

హైదరాబాద్, ఫిబ్రవరి 23 (విజయక్రాంతి) : ఐటీ మాత్రమే కాకుండా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్, ఏరో స్పేస్, మాన్యుఫ్యాక్చరింగ్, ఫిన్‌టెక్, డీప్ టెక్, రిటైల్ తదితర రంగాల్లోనూ హైదరాబాద్‌ను ‘గ్లోబల్ వాల్యూ క్రియేషన్ హబ్’గా మార్చేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు.

అందుకోసం పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తెలంగాణ యువతను ‘రెడీ టూ వర్క్ ఫోర్స్’గా తీర్చిదిద్దడం, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించే గ్లోబల్ ఇన్నోవే షన్ ఎకోసిస్టం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. సోమవారం నానక్‌రాంగూడ ఫైనాన్షియ ల్ డిస్ట్రిక్ట్‌లో అమెరికాకు చెందిన అంతర్జాతీయ బీమా దిగ్గజం హార్ట్ ఫోర్డ్ 1.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో.. 1,200 మంది ఉద్యోగుల సామర్థ్యంతో ఏర్పాటుచేసిన ‘ది హార్ట్ ఫోర్డ్ ఇండియా టెక్నాలజీ సెంటర్’ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. అంతర్జాతీయ విస్తరణలో భాగంగా రెండు శతాబ్దాల ఘన చరిత్ర కలిగిన హార్డ్ ఫోర్ట్ హైదరాబాద్‌ను ఎంపిక చేసుకోవడం ఇక్కడి ప్రతిభకు, డిజిటల్ ఇంజనీరింగ్‌లో మన నాయకత్వానికి దక్కిన గుర్తింపుగా భావిస్తున్నామన్నారు. ఈ కేంద్రం ద్వారా ఏఐ, రిస్క్ ఇంటెలిజెన్స్‌తో కూడిన ఆధునిక బీమా రంగంలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మరింత పెరుగుతుంద న్నారు.

నగరంలో ఇప్పటికే 400కు పైగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ) సేవలు అందిస్తున్నాయన్నారు. ఈ జాబితాలో మా రియట్, మెక్‌డొనాల్డ్స్, యూబీఎస్, డాజన్, వాన్‌గార్డ్, ఎలీ లిల్లీ, హెచ్‌సీఏ హెల్త్ కేర్, సిటిజన్స్ బ్యాంక్ లాంటి దిగ్గజ సంస్థలు ఉన్నా యన్నారు. వీటిని కేవలం బ్యాక్ ఎండ్ ఆపరేషన్స్‌కు మాత్రమే పరిమితం చేయకుండా.. గ్లోబల్ వాల్యూ సెంటర్లుగా మార్చేలా అవసరమైన వ్యూహాత్మక ప్రణాళికలు రూపొం దించి అమలు చేస్తున్నామన్నారు.

పారదర్శక పాలన, సమర్థవంతమైన నాయకత్వం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో సంస్కరణలు, ఆధునిక డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభి వృద్ధి తదితర అంశాలు హార్ట్ ఫోర్డ్ లాంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు తెలంగాణను తమ గమ్యస్థానంగా ఎంచుకునేందుకు దో హదపడుతున్నాయన్నారు.

ఈ కార్యాలయం యూఎస్‌లోని హార్ట్ ఫోర్డ్, చికాగో, షార్లెట్, కొలంబస్‌లో ఉన్న టెక్నాలజీ కేంద్రాలకు అనుబంధంగా పనిచేస్తూ.. ఏఐ, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, అడ్వాన్డ్స్ టెక్నాలజీ డెవలెప్‌మెంట్ పై దృష్టి సారిస్తూ ‘ఇంజినీరింగ్ ఎక్స్ లెన్స్ హబ్ ’గా పని చేస్తుందన్నారు. కార్యక్రమంలో హార్ట్ ఫోర్డ్ ప్రెసిడెంట్ మోరిస్ టూకర్, చీఫ్ మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్స్ ఆఫీసర్ క్లైర్ బర్న్స్, సీఐవో శేఖర్ పన్నాల, హార్ట్ ఫోర్డ్ ఇండియా ఎండీ అండ్ హెడ్ సూర్య తమ్మిరాజు, సీటీవో ఇమ్రాన్ మాలిక్  పాల్గొన్నారు.