శరత్ సిటీ క్యాపిటల్ మాల్ వద్ద ట్రాఫిక్ మెరుగుదలకు సంయుక్త తనిఖీలు
02-07-2026 12:46 AM
శేరిలింగంపల్లి, జూలై 1 (విజయక్రాంతి): శరత్ సిటీ క్యాపిటల్ మాల్ పరిసరాల్లో తీవ్రమైన ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీజన, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా.ఏం.రమేష్, శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ నారాయణ అమిత్, ట్రాఫిక్ పోలీసు, టౌన్ ప్లానింగ్,ఇంజినీరింగ్ విభాగాల సీనియర్ అధికారులు సంయుక్త తనిఖీ చేశారు.
ప్రవేశ నిష్క్రమణ మార్గాల మెరుగుదల, రహదారి విస్తరణ, అండర్పాస్,ఫుట్ ఓవర్ బ్రిడ్జి, పార్కింగ్ వ్యవస్థల బలోపేతం వంటి అంశాలను అధికారులు సమీక్షించారు. ట్రాఫిక్ ప్రవాహం మెరుగుపరచడం, పాదచారుల భద్రత పెంపొందించడం కోసం సంయుక్త కార్యాచరణ ప్రణాళిక రూపొందించి త్వరగా అమలు చేయాలని కమిషనర్ ఆదేశించారు.






