8 June, 2026 | 1:42 PM

కుటుంబకలహాలు.. భర్త చేతిలో భార్య హత్య

08-06-2026 12:11 PM

హైదరాబాద్: నగరంలోని బహదూర్‌పుర పోలీస్ స్టేషన్(Bahadurpura Police Station) పరిధిలోని కిషన్ బాగ్ ప్రాంతంలో(Kishan Bagh) దారుణం చోటుచేసుకుంది. కుటుంబ తగాదాల కారణంగా ఒక వ్యక్తి తన భార్యను కిరాతకంగా హత్య చేశాడు. పోలీసుల వివరాల ప్రకారం, నిందితులైన సులేమాన్ బిన్, నిషత్ ఫాతిమా (28)లకు 2016లో వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలున్నారు. 

ఈ దంపతులు గత కొన్నేళ్లుగా కుటుంబపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. వారి మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించుకుని ప్రశాంతంగా జీవించేలా చేసేందుకు, కుటుంబ పెద్దలు పలుమార్లు జోక్యం చేసుకుని వారికి సలహాలు, సూచనలు ఇచ్చారు. వివాహం అనంతరం వాళ్లు కిషన్ బాగ్ లోని తమ ఇంట్లో నివసిస్తున్నారు. తరచుగా ఆమెను వేధింపులకు గురి చేసేవాడని, వేధింపులు భరించలేక నిషత్ సులేమాన్‌పై ఫాతిమా మహిళా పోలీస్ స్టేషన్‌లో(Women's Police Station) ఫిర్యాదు చేసిందని పోలీసులు వెల్లడించారు.

పెద్దల సమక్షంలో జరిగిన పోలీస్ కౌన్సెలింగ్(Police Counseling) సమయంలో ఆమెను మంచిగ చూసుకుంటానని సులేమాన్ చెప్పాడు. కానీ క్రమంగా నిషత్ ఫాతిమాపై ద్వేషం పెంచుకున్నాడు. ఆదివారం సాయంత్రం సులేమాన్ కత్తితో నిషత్ ఫాతిమా ఇంటికి వెళ్లి, ఆమె పిల్లలను వేరే గదిలో పడుకోమని బెదిరించాడు. ఆ తర్వాత అతను ఫాతిమాపై దారుణంగా దాడి చేసి గొంతు కోసి పారిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పోస్ట్‌మార్టం పరీక్ష కోసం మృతదేహాన్ని ఉస్మానియా జనరల్ హాస్పిటల్ మార్చురీకి తరలించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడి ఆచూకీ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు.