భాగ్యరెడ్డివర్మ ఆశయాలు ఆదర్శం
సంగారెడ్డి, మే 22: సామాజిక సమానత్వం, విద్యా విస్తరణ, అణగారిన వర్గాల అభ్యున్నతికి జీవితాంతం కృషి చేసిన మహనీయుడు భాగ్యరెడ్డి వర్మ అని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ కొనియాడారు. భాగ్యరెడ్డి వర్మ జయంతి సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన జయంతి వేడుకల్లో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో వెనుకబడిన వర్గాలకు విద్య, ఆత్మగౌరవం, సమాన హక్కుల కోసం భాగ్యరెడ్డి వర్మ చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.
యువత మహనీయుల ఆశయా లను ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని, సమానత్వ భావనతో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ పాండు, జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి అఖిలేష్ రెడ్డి, జిల్లా అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.






