14-02-2026 01:20:04 AM
భూత్పూర్, ఫిబ్రవరి 13: మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని భూత్పూర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా కాంగ్రెస్ పార్టీ నుంచి భార్య భర్తలు బరిలో నిలిచారు. 1వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి మాధురి, 8వ వార్డు నుంచి మూడవత్ బాలకోటి పోటీ చేసి శుక్రవారం ఎన్నికల ఫలితా ల్లో ఘనవిజయం సాధించారు. దంపతులు ఇద్దరు కౌన్సిలర్లుగా గెలిచారు. మున్సిపల్ చైర్మన్ గా బాలకోటి పదవి బాధ్యతలు త్వర లో చేపట్టనున్నట్లు తెలుస్తుంది. భార్యాభర్తల విజయం సాధించడంతో ఆయా వార్డుల కాంగ్రెస్ నాయకులు, అభిమానులు, ప్రజ లు ఆనంద వ్యక్తం చేశారు.