నాని ఈవీ మోటార్స్ షోరూంను ప్రారంభించిన మాజీ డిసిసిబి చైర్మన్ భాస్కర్ రెడ్డి
12-07-2026 04:45 PM
బాన్సువాడ,(విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా కేంద్రం వినాయక్ నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన నాని EV మోటార్స్ షోరూమ్ ను ఆదివారం మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, నూడా ఛైర్మెన్ కేశవేణు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నాని ఈవి మోటార్స్ యాజమాన్యం వర్ని మండలం నెహ్రూ నగర్ గ్రామ మాజీ సర్పంచ్ నాని కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉమ్మడి వర్ని మండల ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.






