12 July, 2026 | 5:36 PM

Breaking News

పెద్దమ్మ తల్లి బోనాల మహోత్సవంలో ప్రభుత్వ విప్ విజయరమణరావు   •   వనదుర్గమ్మకు భక్తుల తీరొక్క మొక్కులు   •   నూతన ఎస్సీ సెల్ అధ్యక్షుడిని సన్మానించిన ఎమ్మెల్యే పాయం   •   సర్పంచుల శిక్షణకు ఎంపికైన పాట్నాపూర్ సర్పంచ్   •   జాతీయ కిక్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీలకు ధర్మపురి క్రీడాకారుడు ఎంపిక   •   వర్షాలు సమృద్ధిగా కురవాలని జెట్టక్కను తరిమికొట్టిన గ్రామస్తులు   •   పదవి విరమణ పొందిన ఉపాధ్యాయునికి ఘన సన్మానం   •   ఎస్ఐఆర్ ఎన్యుమరేషన్ ప్రక్రియను పరిశీలించిన మార్కెట్ కమిటీ చైర్మన్   •   ప్రజలకు మరింత, పారదర్శకమైన పోలీస్ సేవలు   •   జగన్నాథ రథయాత్రను విజయవంతం చేద్దాం   •  

ముత్తారంలో 52 ఏళ్ల తర్వాత ఒకేచోట కలిసిన 1974 బ్యాచ్ విద్యార్థులు

12-07-2026 04:40 PM

మంథని ప్రభుత్వ పాఠశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్న సహచరులు

మంథని,(విజయక్రాంతి): మంథని ప్రభుత్వ పాఠశాలలో 1974 బ్యాచ్‌లో చదువుకున్న పూర్వ విద్యార్థులు ఆదివారం ముత్తారం మండల కేంద్రంలో ఆత్మీయంగా కలుసుకున్నారు. దాదాపు 52 ఏళ్ల తర్వాత ఒకేచోట సమావేశమైన వారు చిన్ననాటి మధుర జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు.

ఈ సందర్భంగా పాఠశాల రోజుల్లోని మధురానుభూతులు, తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులు, సహచరులతో గడిపిన అనుభవాలను ఒకరితో ఒకరు పంచుకున్నారు. ప్రస్తుతం వివిధ రంగాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులు పరస్పరం కుటుంబ సభ్యులను పరిచయం చేసుకుని ఆత్మీయంగా ముచ్చటించారు. ఇలాంటి సమ్మేళనాలు స్నేహబంధాలను మరింత బలోపేతం చేస్తాయని, ప్రతి ఏడాది ఇదే తరహాలో సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు.