12 July, 2026 | 5:32 PM

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం మరింత వేగవంతం చేయండి

12-07-2026 04:36 PM

బోథ్,(విజయక్రాంతి): ఇందిరమ్మ ఇండ్లను మరింత వేగవంతంగా పూర్తి చేయాలని సోనాల ఎంపీడీవో రత్నాకర్ రావు లబ్ధిదారులకు సూచించారు. ఆదివారం మండలంలోని వజ్జర్ గ్రామపంచాయతీ పరిధిలోని నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు. ఈనెల 15వ తేదీలోగా 40 ఇండ్ల నిర్మాణం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించడంతో ఎంపీడీవో లబ్ధిదారులను కలిసి పనులు వేగవంతం చేయాలని సూచించారు. పనులు పూర్తి చేసిన వెంటనే దశలవారీగా బిల్లులు చెల్లించడం జరుగుతుందని ఈ విషయంలో లబ్ధిదారులు ఆందోళన చెందవద్దన్నారు