12 July, 2026 | 5:57 PM

Breaking News

జగన్నాథ రథయాత్రను విజయవంతం చేద్దాం

12-07-2026 05:06 PM

ఎంఎల్‌ఎ గంగుల కమలాకర్‌

ముకరంపుర,(విజయక్రాంతి): ఈ నెల 16న మహాలక్ష్మీ దేవాలయం నుండి వైశ్యాభవన్‌ వరకు చేపడుతున్న జగన్నాథ రథయాత్రను విజయవంతం చేయడంలో కరీంనగర్ భక్తకోటి స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని స్థానిక శాసనసభ్యులు, మాజీ మంత్రి గంగుల కమలాకర్‌ పిలుపునిచ్చారు. ఈ రోజు జగన్నాథ రథయాత్ర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కరపత్రాలను, పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడుతూ... ప్రతి ఏటా రథోత్సవం భారీ భక్తుల మధ్య కరీంనగర్ పురవీధుల్లో జరగడం సంతోషదాయకమని అభిప్రాయపడ్డారు.

కరీంనగర్ పట్టణానికి ప్రధాన ఆకర్షణగా నిలిచే ఇస్కాన్‌ మందిరం సమీప భవిష్యత్తులో కార్యరూపం దాల్చడానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. మధ్యాహ్న హారతి కార్యక్రమంలో పాల్గొన్న గంగుల కమలాకర్‌ స్వామి వారి దీవెనలు పొంది ప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు రథయాత్ర ఏర్పాట్లను వివరించారు. ఈ కార్యక్రమంలో నగర మాజీ మేయర్‌ సర్దార్‌ రవీందర్ సింగ్‌, మాజీ కార్పొరేటర్‌ హరిశంకర్‌, కార్పొరేటర్ గుగ్గిళ్ల జయశ్రీ - శ్రీనివాస్‌లతో పాటు ఉత్సవ కమిటీ సభ్యులు డాక్టర్ ఎల్‌. రాజభాస్కర్‌ రెడ్డి పాల్గొన్నారు.