28 February, 2026 | 5:55 PM

ఉపాధిహామీ పనుల పర్యవేక్షించిన సర్పంచ్

28-02-2026 03:10 PM

భిక్కనూర్,(విజయక్రాంతి): భిక్కనూర్ మండలం కాచపూర్ గ్రామంలో సర్పంచ్ పాలమకుల జ్యోతి సంతోష్ గౌడ్ ఉపాధిహామీ పనులను పర్యవేక్షించారు. పనుల నాణ్యత, కూలీల హాజరు, వేతనాల క్రమం, ప్రాజెక్ట్ పురోగతి పరిశీలించి, అవసరమైతే సరిదిద్దాలని సూచించారు.

గ్రామ అభివృద్ధికి పని సమయపాలన, నియమావళి ప్రకారం పనులు చేపట్టాలని కార్మికులను ప్రేరేపించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొని పర్యవేక్షణకు సహకరించారు.