ఇందిరమ్మ ఇళ్లకు గృహప్రవేశాలు
సిరికొండ,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా లక్ష గృహప్రవేశాల కార్యక్రమం మంగళవారం మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించారు. సోన్‌పల్లి, లచ్చింపూర్ (బి), రాయిగూడ గ్రామాల్లో నిర్మాణం పూర్తిచేసుకున్న ఇందిరమ్మ ఇళ్లకు లబ్ధిదారులు గృహప్రవేశాలు చేశారు. సోన్‌పల్లిలో తహశీల్దార్ తుకారాం, సర్పంచ్ లక్ష్మీకాంత్, లచ్చింపూర్ (బి)లో అరేయ్ రాజేశ్వర్, సర్పంచ్ కుమరం దీపక్, రాయిగూడలో ఎంపీడీఓ సంతోష్ కుమార్, సర్పంచ్ పెందూర్ లక్ష్మణ్‌రావు పాల్గొని గృహప్రవేశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా గృహప్రవేశాలు చేసిన లబ్ధిదారులకు అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. ఇంకా నిర్మాణాలు పూర్తి కాని ఇందిరమ్మ ఇళ్లను త్వరితగతిన పూర్తిచేసుకొని గృహప్రవేశాలు నిర్వహించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సూర్యాకాంతం, ఉపసర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.






