2 June, 2026 | 8:57 PM

Breaking News

గ్రామ గ్రామాన తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

02-06-2026 07:57 PM

ములకలపల్లి,(విజయక్రాంతి): తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మంగళవారం ములకలపల్లి మండలంలో ఘనంగా నిర్వహించారు. గ్రామ గ్రామాన వేడుకలు జరిగాయి. మండలంలోని 20 గ్రామ పంచాయతీల కార్యాలయాల ఎదుట సర్పంచులు జాతీయ జెండాను ఎగురవేసి తెలంగాణ గేయాన్ని ఆలపించారు. ప్రభుత్వ కార్యాలయాల ఎదుట అధికారులు ఘనంగా వేడుకలను నిర్వహించారు.వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. కాంగ్రెస్,బీఆర్ఎస్,సిపిఐ, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీల నాయకులు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో పాల్గొని తెలంగాణ ప్రాముఖ్యత విశిష్టతను వివరించారు. ఆయా పార్టీ కార్యాలయాల ఎదుట జెండాలను ఎగరవేశారు.