calender_icon.png 20 February, 2026 | 1:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు ధ్వంసం

20-02-2026 11:40:03 AM

పేలిన సమయంలో ఇంట్లో ఎవరు లేకపోవడంతో తృటిలో తప్పిన పెను ప్రమాదం.

తూప్రాన్, ఫిబ్రవరి 20(విజయక్రాంతి): మెదక్ జిల్లా మండలం ఘనపూర్ లో దొడ్ల సతీష్ ముదిరాజ్ ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీక్(Gas Cylinder Explosion) అయి పేలడంతో వంట రూమ్ పూర్తిగా ధ్వంసం అయింది. ఇంట్లో ఉన్న బియ్యం, బట్టలు విలువైన ఫ్రిజ్జు, కూలర్ వంటసమాగ్రి, ధ్వంసం అయ్యాయి. ఉదయం 10:50 ప్రాంతంలో ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు ఇంటి బయట పనులు చేస్తుండగా బాత్రూంలో ఇంటి యజమాని స్నానం చేస్తుండగా గ్యాస్ సిలిండర్ లీక్ అయి పేలిన ఘటన ఘనపూర్ లో చోటుచేసుకుంది. కుటుంబ యజమాని భార్య పిల్లలు ఇంట్లోని వస్తువులు పూర్తి ధ్వంసం కావడానికి చూసి బోరున విలపించారు. గ్రామస్తులు తక్షణమే ఫైర్ ఇంజన్ కు ఫోన్ చేయడంతో హుటాహుటిన వచ్చిన ఫైర్ ఇంజన్ నైట్రోజన్ ద్వారా గ్యాస్ ద్వారా పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఎవరు లేకపోవడంతో తృటిలో తప్పిన ప్రమాదం. తూప్రాన్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని పూర్తి వివరాలు సేకరించారు.