18 August, 2026 | 2:39 AM

ఆసుపత్రిపనులు వేగవంతం చేయాలి

18-08-2026 12:41 AM

ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

కల్వకుర్తి ఆగస్టు 17 : కల్వకుర్తి ప్రాంత ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పట్టణంలో నిర్మిస్తున్న వంద పడక ల ఆసుపత్రి భవన నిర్మాణం వేగవంతం చే యాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అ న్నారు. సోమవారం నిర్మాణంలో ఉన్న భవనాన్ని స్థానిక నాయకులతో కలిసి పరిశీ లించారు. ఇప్పటి వరకు చేపట్టిన పనులు వాటి పురోగతిని తెలుసుకున్నారు. ఆసుపత్రి ఆవరణలో తిరిగి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని గడువులోగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేసి సకాలంలో పూర్తి చేయాలని కోరారు. ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, 100 పడకల ఆసుపత్రి తో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయన్నారు.