29 June, 2026 | 10:51 AM

బీజేపీ నేతలతో నితిన్ నబీన్ బ్రేక్‎ఫాస్ట్ మీటింగ్

29-06-2026 09:37 AM

హైదరాబాద్: రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ లతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్(BJP National President Nitin Nabin) బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారు. బేగంపేట పర్యాటక భవన్ లో రామచందర్ రావు(Ramachander Rao) అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. ఈ కీలక భేటీకి అభయ్ పాటిల్, సునీల్ బన్సల్, ఆశిష్ సెల్లార్, రేఖా శర్మ, చంద్రశేఖర్ తివారీతో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. తెలంగాణలో పార్టీ సంస్థాగత బలోపేతం, బూత్ కమిటీల పనితీరుపై సమావేశంలో చర్చించారు. పార్టీ పరిస్థితి, అధికారంలోకి వచ్చేందుకు చేపట్టాల్సిన అంశాలపై చర్చించారు. మూడు రోజుల తెలంగాణ పర్యటనలో భాగంగా నితిన్ నవీన్ రాష్ట్రానికి వచ్చారు. 

నితిన్ నబిన్ తెలంగాణ పర్యటన షెడ్యూల్

సోమవారం ఉదయం 10.30 కు వీబీఐటీ క్యాంపస్ లో విద్యార్థులతో కాన్ క్లేవ్ కు హాజరు కానున్నారు. దాదాపు రెండు వేల మంది విద్యార్థులు కాన్ క్లేవ్ కు హాజరుకానున్నట్లు నేతలు తెలిపారు. భారత్- భవిష్యత్ సవాళ్లపై విద్యార్థుల ప్రశ్నలకు నబీన్ జవాబు ఇవ్వనున్నారు. 2047 వికసిత్ భారత్ లక్ష్యం, 12 ఏళ్ల మోదీ పాలనపై సమావేశంలో చర్చించనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు వరంగల్ గిరిజన సంఘాల లీడర్లతో నబీన్ మాటామంతీ నిర్వహించనున్నారు. సాయంత్రం 4.30 గంటలకు ఉమ్మడి వరంగల్ బూత్ అధ్యక్షులతో నబీన్ భేటీ కానున్నారు. భేటీ తర్వాత భద్రకాళి ఆలయంలో నితిన్ నబీన్ పూజలు చేయనున్నారు. రాత్రి 8.30 గంటలకు హైదరాబాద్ టూరిజం ప్లాజాలో ఆఫీస్ బేరర్లతో నబీన్ భేటీ కానున్నారు.