20 April, 2026 | 3:46 AM

పెగడపెల్లి మండలంలో ఘోర ప్రమాదం

20-04-2026 02:05 AM

ఘటన స్థలాన్ని పరిశీలించిన మంత్రి అడ్లూరి 

ధర్మపురి, ఏప్రిల్19 (విజయక్రాంతి): పెగడపల్లి మండలం నందగిరి గ్రామంలో ఆదివారం విషాద ఘటన చోటు చేసుకుంది. వరి కోస్తుండగా అదుపుతప్పి బావిలోకి కోతమీషన్ దూసుకెళ్లడంతో ఈ ఘోరప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో డ్రైవర్ పాలకల్ల మధు(30) అక్కడికక్కడే దుర్మరణం చెందారు.

సంఘటన స్థలానికి పోలీస్ లు చేరుకుని విచారణ చేపట్టారు. హార్వెస్టర్ బావిలో పడి జరిగిన ప్రమాదంలో మరణించిన బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అల్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. పెగడపల్లి మండలం నందగిరి గ్రామంలో హార్వెస్టర్ బావిలో పడ్డ ప్రమాద స్థలాన్ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదివారం సాయంత్రం సందర్శించారు. ఈ సందర్భంగా ప్రమాదం జరిగిన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు.

బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వం తరపున అన్ని విధాల ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రమాదానికి కారణమైన బావిని మంత్రి పరిశీలించారు.మృతదేహాన్ని వెలికితీయడానికి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ను ఫోన్ లో మంత్రి ఆదేశించారు. పోస్టుమార్టం అయ్యేవరకు అధికారులు దగ్గరుండి పర్యవేక్షించాలని మంత్రి ఆదేశించారు. అంత్యక్రియలు పూర్తి అయ్యే వరకు కాంగ్రెస్ మండల బాధిత కుటుంబానికి అండగా నిలవాలి మంత్రి సూచించారు.