8 July, 2026 | 1:54 AM

స్వార్థ ప్రయోజనాల కోసమే ‘కాళేశ్వరం’ నిర్మాణం

08-07-2026 12:48 AM

పెద్దపల్లిలో విలేకరుల సమావేశ ప్రభుత్వ విప్ విజయరమణరావు మండిపాటు

పెద్దపల్లి, జూలై 7 (విజయక్రాంతి) : గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును రైతుల ప్రయోజనాల కోసం కాకుండా కేవ లం స్వార్థ, కుటుంబ ప్రయోజనాల కోసమే నిర్మించిందని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మె ల్యే చింతకుంట విజయరమణ రావు తీవ్రస్థాయిలో ఆరోపించారు. మంగళవారం పె ద్దపల్లి జిల్లా కేంద్రంలోని నందన్ గార్డెన్స్లో స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయరమణ రావు మాట్లాడు తూ.. గత నాలుగు రోజులుగా బీఆర్‌ఎస్ నా యకులు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల అంశంపై రైతులను, ప్రజలను తప్పు దోవ పట్టించేలా అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు.

కాంగ్రెస్ హయాంలోనే పటిష్ఠ ప్రాజెక్టులు..

గతంలో వై.ఎస్. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే తుమ్మిడి హెట్టి ఎత్తిపోతల ద్వారా ఎల్లంపల్లికి నీరు త రలించేలా అద్భుత రూపకల్పన చేశారని విజయరమణ రావు గుర్తుచేశారు. కానీ, ఆ తర్వాత వచ్చిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం రీ-డిజైనింగ్ పేరిట భారీ వ్యయంతో కాళేశ్వరం ప్రా జెక్టును నిర్మించి, ప్రజాధనాన్ని దుర్వినియో గం చేసిందని ధ్వజమెత్తారు. ‘ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కింద నుంచి పైకి నీ టిని ఎత్తిపోసే వింత ప్రాజెక్టును నిర్మించారు.

ఐదేళ్లలో భారీగా నీటిని ఎత్తిపోశామని ప్రచా రం చేసుకున్నారే తప్ప, వాస్తవంగా రైతులకు ఆశించిన స్థాయిలో నీటి సరఫరా జరగలేదు. ప్రపంచ అద్భుతంగా డబ్బా కొట్టుకు న్న ఈ ప్రాజెక్టు వల్ల కనీసం పెద్దపల్లి, ధర్మా రం, మంథని ప్రాంతాల రైతులకు కూడా సరైన సాగునీరు అందలేదని అన్నారు. రా ష్ట్రంలోని నాగార్జునసాగర్, శ్రీశైలం, పులిచింతల, ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి, మిడ్ మానేరు, లోయర్ మానేరు వంటి ప్రధాన ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ హయాంలో కట్టినవేనని, అవి ఇప్పటికీ అత్యంత పటిష్ఠంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. కానీ బీఆర్‌ఎస్ పాలనలో ఎండాకాలంలో ప్రారంభించిన ప్రాజెక్టులు వర్షాకాలం వచ్చేసరికే కూలిపోయే దౌ ర్భాగ్య స్థితి ఏర్పడిందని, అందుకు కాళేశ్వరమే సజీవ సాక్ష్యమని ఎద్దేవా చేశారు.

రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి..

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి న తర్వాత ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి వరద కాలువల ద్వారా రాష్ట్ర రైతులకు సక్రమంగా సా గునీరు అందించిందని, ఫలితంగానే రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి సాధించగలిగామ ని విప్ వివరించారు. రైతుల సంక్షేమమే ధ్యే యంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు.ఈ మీడియా సమా వేశంలో పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు, పట్టణ కౌ న్సిలర్లు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.