8 July, 2026 | 2:00 AM

క్వార్టర్ ఫైనల్లో బెల్జియం

08-07-2026 12:50 AM

వరల్డ్‌కప్ నుంచి అమెరికా ఔట్

సియాటిల్, జూలై 7: సాకర్ ప్రపంచకప్‌లో బెల్జియం క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ప్రీక్వార్టర్స్‌లో ఆతిథ్య అమెరికాపై 4 స్కోరుతో తిరుగులేని విజయాన్ని అందుకుంది. మ్యాచ్ ఆరంభమైన 46 సెకన్ల నుంచి బెల్జియం అటాకింగ్ విరుచుకుపడింది. 9వ నిమిషంలో డి కెటెలెరే గోల్ చేసి 1 ఆధిక్యాన్ని అందించాడు.

అయితే 30వ నిమిషంలో అమెరికా ప్లేయ ర్ టిల్‌మన్ గోల్‌తో స్కోరు సమమైంది. మరో 2 నిమిషాలకే కెటెలెరే మరో గోల్ చేసి 2 ఆధిక్యంలో నిలిపాడు. సెకండాఫ్‌లో వనాకెన్, లుకా మరో రెండు గోల్స్ చేయడంతో బెల్జియం ఘనవిజయం సాధించింది. అమెరికా ఓటమితో ఆతిథ్య జట్ల పోరాటం ముగిసినట్టయింది. క్వార్టర్ ఫైనల్లో స్పెయిన్, బెల్జియం తలపడతాయి.