8 July, 2026 | 1:54 AM

బీ క్యాటగిరీ సీట్లను ఆన్‌లైన్‌లో భర్తీ చేయాలి

08-07-2026 12:48 AM

 ఉన్నత విద్యామండలి చైర్మన్‌కు ఎస్‌ఎఫ్‌ఐ వినతి

హైదరాబాద్, జూలై 7 (విజయక్రాంతి): రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో బీ-క్యాటగిరీ సీట్లను పూర్తిగా ఆన్‌లైన్‌లో భర్తీ చేయా లని ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్ చేసింది. ఈమేరకు మం గళవారం ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధానకార్యదర్శి టి.నాగరాజు, రాష్ట్ర కమిటీ సభ్యులు లెనిన్ గువేరా, జూనుగరి రమేష్, రాష్ట్ర నాయకులు అరుణ్‌లతో కూడిన బృందం తెలంగాణ ఉన్న త విద్యామండలి చైర్మన్ ప్రొ.వి.బాలకిష్టారెడ్డికి వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా పలు అంశాలను చైర్మన్ దృష్టికి తీసుకెళ్లినట్లు టి.నాగరాజు తెలిపారు. మేనేజ్‌మెంట్ కోటా పేరుతో జరుగుతున్న ప్రైవేట్ కాలేజీల దోపిడీని అరికట్టాలని కోరారు. అలాగే ఉస్మాని యా వర్సిటీ పరిధిలోని బీబీఏ రెండో సెమిస్టర్ పరీక్షల టైమ్‌టేబుల్‌ను సవరించాలని విజ్ఞప్తి చేశారు.