ఘనంగా హోలీ సంబరాలు
03-03-2026 09:44 PM
మోతె,(విజయక్రాంతి): మండల పరిధిలోని గోపతాండ గ్రామంలో మాలోతు యువరాజ్ ఆధ్వర్యంలో మంగళవారం హోళీ వేడుకలు జరుపుకున్నారు. గ్రామస్తులు కేరింతలు కొడుతూ ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ, పాటలు పాడుతూ సంతోషంగా గడిపారు. ఈ కార్యక్రమంలో మాలోతు అనసూర్య, మాలోతు అక్షిత, రిపోర్టర్ మాలోతు కోటి, రాజేష్, కవిత, బన్ను, చిన్ను, ఐషు, ధనావత్ చినా, పూలమ్మ, మాలోతు బుజ్జి, మాలోతు రాజేష్, మాలోతు తేజక్షిత, ధనావత్ హాతిరాం, ధనావత్ లచ్చిరాం, ధనావత్ వేణు, తదితరులు పాల్గొన్నారు.




