6 May, 2026 | 3:21 PM

పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరతపై సీపీఐ ధర్నా

06-05-2026 02:27 PM

ఇల్లందు, మే 6 (విజయక్రాంతి): పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరతకు వ్యతిరేకంగా సిపిఐ ఆధ్వర్యంలో పాత బస్టాండ్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు కే సారయ్య మాట్లాడుతూ ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ శంకర్, బాస శ్రీనివాస్, సత్యనారాయణ, నజీర్ అహ్మద్, రాజారాం, కృష్ణ, వెంకటేశ్వర్లు, చందర్రావు, శ్రీలక్ష్మి, ఐలయ్య, రాజయ్య, కాసిం అమాలి తదితరులు పాల్గొన్నారు.