6 May, 2026 | 4:09 PM

కోడింగ్ ట్యూటర్, ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ కళాశాల టిఎస్కేసితో ఒప్పందo

06-05-2026 03:18 PM

ముకరంపుర,(విజయక్రాంతి): ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ & సైన్స్  కళాశాల, కరీంనగర్ మరియు AJA కోడింగ్ ట్యూటర్ మధ్య పరస్పర అవగాహనా ఒప్పందం కుదిరింది. ఈ ఎం.ఓ.యూ ద్వారా కళాశాల విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ ఇచ్చి ఇంటర్న్షిప్ ద్వారా విద్యార్థులకు ఉపాధి అవకాశాలు అందిస్తున్నట్టు కళాశాల ప్రిన్సిపాల్ కలువకుంట రామకృష్ణ, కోడింగ్ ట్యూటర్ సంస్థ ప్రతినిధి ప్రశాంత్ కుమార్ సురభి  ఒక సంయుక్త ప్రకటనలో తెలియజేశారు. ఈ ఒప్పందం మూడు సంవత్సరాలు మనుగడలో ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఒప్పందం ద్వారా విద్యార్థులకు ఉద్యోగ నైపుణ్య శిక్షణ అందించబడుతుంది ఇది కళాశాల విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో మేలు చేకూర్చుతుందని తెలియజేశారు.