సింగిల్ విండో చైర్మన్ గా పదవి బాధ్యతలు
06-05-2026 03:22 PM
చందుర్తి,(విజయక్రాంతి): మండల కేంద్రంలో సింగిల్ విండో చైర్మన్ గా తిప్పని శ్రీనివాస్ మళ్ళీ బాధ్యతలు స్వీకరించారు.గత సంవత్సరం పదవి కాలం పూర్తి కావడంతో ప్రభుత్వం ఎలక్షన్ నిర్వహించకపోగా వారి పదవులను రద్దు చేస్తూ జీవో జారిచేశారు. అనంతరం వారు హైకోర్టుకు ఆశ్రయించడంతో హైకోర్టు ప్రభుత్వాన్ని కోరుతూ సింగిల్ విండో ఎన్నికలు నిర్వహిస్తారా? లేక నామినేట్ పోస్టులు భర్తీ చేస్తారా? అని, అప్పటివరకు పదవులను రద్దు చేయబడిన వారినే సింగల్ విండో చైర్మన్ గా కొనసాగాలని ఆదేశాలు జారీ చేయగా చైర్మన్ గా తిప్పని శ్రీనివాస్ సింగిల్ విండో కార్యాలయంలో మళ్లీ బాధ్యతలు స్వీకరించారు.






