3 July, 2026 | 5:29 PM

Breaking News

కాంగ్రెస్ కు ప్రచార ఆర్భాటాలు తప్ప ప్రజా సంక్షేమం పట్టదు   •   కామ్రేడ్ అరుణోదయ నాగన్న మృతి ఉద్యమానికి తీరని లోటు   •   కేటీఆర్, హరీష్ లకు వార్తల్లో నిలవాలన్న తాపత్రయం.!   •   ఈవీఎంల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   యూరియా రైతులకు సరిపడా అందించాలి   •   తెలంగాణలో ఏపీ పోలీసుల చర్యలు ఖండనీయం   •   సింగరేణి ప్రధాన కార్యాలయంలో శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట   •   37వ డివిజన్లో 77 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన   •   నవ మహిళా సాధికార కేంద్రంలో మహిళలకు చెక్కుల పంపిణీ   •   పసికందు కిడ్నాప్.. 72 గంటల్లో కేసును చేదించిన పోలీసులు   •  

వనదుర్గమ్మను దర్శించుకున్న కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి

06-05-2026 02:29 PM

రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్

పాపన్నపేట: రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గామాతను రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి(Kothakota Seetha Dayakar Reddy) బుధవారం దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తీర్థప్రసాదాలు అందజేసి ఆలయ మర్యాదలతో ఆలయ సిబ్బంది వారిని సత్కరించారు. వీరి వెంట బోర్డు సభ్యులు వందన గౌడ్, చందన, వచన్ కుమార్, బండి అపర్ణ, ప్రేమ్ లత అగర్వాల్, ఆలయ సిబ్బంది ఉన్నారు.