చంద్రగ్రహణం ఎఫెక్ట్.!
03-03-2026 10:10 PM
- శ్రీశైలంలో ఆలయ ద్వారాలు మూసివేత
- తిరిగి రాత్రి 9 గంటల నుండి పునర్దర్శనం
నాగర్ కర్నూల్/శ్రీశైలం,(విజయక్రాంతి): చంద్రగ్రహణం నేపథ్యంలో శ్రీశైల దేవస్థానంలోని ప్రధాన ఆలయ ద్వారాలు మంగళవారం ఉదయం గం. 6.00ల నుండి రాత్రి గం. 7.30లకు ఆలయ ద్వారాలు మూసి ఉంచినట్లు ఆలయ అధికారి శ్రీనివాసులు, ఆలయ ప్రధాన పూజారులు తెలిపారు. చంద్రగ్రహణం పూర్తి అనంతరం దేవాలయం ద్వారాలు తెరిచి ఆలయ శుద్ధి, సంప్రోక్షణ, పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం రాత్రి 9 గంటల నుండి స్వామి–అమ్మవార్లకు మహామంగళ హారతులు రాత్రి 10 గంటల వరకు భక్తులకు అలంకార దర్శనం కల్పించినట్లు తెలిపారు.




