వంతెన పై రక్షణ కరువు..!
06-05-2026 02:26 PM
వాంకిడి, (విజయక్రాంతి): వాంకిడి మండల కేంద్రం నుంచి లంజన్ వీర గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి గ్రామ సమీపంలో వాగుపై నిర్మించిన,వంతెన (బ్రిడ్జి) సైడ్ వాల్స్ పడిపోయి ప్రమాదకరంగా మారి వాహనదారులకు రక్షణ కరువైంది. ఇదే రహదారి మీదుగా లంజన్ వీర,ఖైరీట్ తో పాటు చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలు ఆటో, ట్రాక్టర్, ద్విచక్ర వాహనాల ద్వారా వివిధ పనుల నిమిత్తం మండల కేంద్రానికి రాకపోకలు సాగిస్తుంటారు. ద్విచక్ర వాహన చోదకులు రాత్రిళ్లు ఏ మాత్రం అంద మరచిన వాగులో పడడం ఖాయం. సంబంధిత అధి కారులు వాగు పై నిర్మించి ఉన్న వంతెనకు సైడ్ వాల్స్ నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని, వాహన చోదకులు, ప్రజలు కోరుతు న్నారు.






