ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించిన బీఆర్ఎస్ నాయకులు
చెన్నూర్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజక వర్గంలోని కోటపల్లి మండలంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను చెన్నూర్ మాజీ శాసనసభ్యులు బాల్క సుమన్ ఆదేశాల మేరకు BRS, BRSV నాయకులు బుధ వారం తిరిగి పరిశీలించారు. ఈ సందర్బంగా BRSV రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారిశెట్టి విద్యాసాగర్ మాట్లాడుతూ జిల్లాలో మంగళ వారం రాత్రి కురిసిన అకాల వర్షాలకు పారిపెల్లి వడ్ల సెంటర్ లో ధాన్యం తడిసి ముద్దయిందని, వెంటనే కొనుగోళ్లు వేగవంతం చేయాలని, తడిసిన ధాన్యం కొనాలని డిమాండ్ చేశారు.
రైతులు అష్టకష్టాలు పడుతుంటే మంత్రి కనీసం పట్టించుకోకుండా ఎక్కడో ఉండి వీడియోలు మాట్లాడుతున్నారని, కానీ రైతుల వద్దకు, సెంటర్ ల వద్దకు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వడ్ల కొనుగోళ్లు వేగవంతం చేయాలని, లేదంటే పారిపెల్లి జాతీయ రహదారి పైన వెయ్యి మంది రైతులతో ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల రైతులు, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, యువ సోషల్ మీడియా నాయకులు తదితరులు పాల్గొన్నారు.






