3 July, 2026 | 9:41 PM

Breaking News

ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •   హెచ్‌పి గ్యాస్ ఏజెన్సీని ఆకస్మిక తనిఖీ చేసిన హెచ్‌పిసిఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ కోమర శ్రీనివాసు   •   బదిలీపై వెళ్లిన ఇంచార్జ్ ఎంపీడీవోకు ఘన సన్మానం   •   ఆయిల్ పామ్ సాగుతో అద్భుత ఫలితాలు సాధిస్తున్న ప్రభాకర్ రెడ్డికి సన్మానం   •   వర్షపు ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి టార్పాలిన్ అందించిన సర్పంచ్   •  

ప్రధాని మోదీ సభను విజయవంతం చేయండి

06-05-2026 02:22 PM

సుల్తానాబాద్, విజయక్రాంతి: భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈనెల 10 న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ కు వస్తున్న సందర్భంగా నాయకులు, కార్యకర్తలు, యువ మోర్చా , మహిళా యువ మోర్చా సభ్యులు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని బిజెపి ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ అధ్యక్షులు అర్జున్ రావు, బిజెపి సుల్తానాబాద్ మండల అధ్యక్షుడు కందుల శ్రీనివాసులు పిలుపునిచ్చారు.

బుధవారం  పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల భారతీయ జనతా పార్టీ  కార్యవర్గ సమావేశం మండల అధ్యక్షులు కందుల శ్రీనివాస్ అధ్యక్షతన  జరిగింది,  ఈ సమావేశంలో పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణ, ప్రజలతో మరింత సాన్నిహిత్యం పెంపొందించే అంశాలపై చర్చించారు.ఈ భారీ సభకుమండలంలోని  నాయకులు, కార్యకర్తలు, యువమోర్చా, మహిళా మోర్చా సభ్యులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. .ఈకార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు సౌదరి మహేందర్ యాదవ్, జిల్లా కోశాధికారి కామని రాజేంద్రప్రసాద్ , నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..