4 March, 2026 | 11:35 PM

జవహర్ నగర్‌లో జోరుగా హోలీ సంబరాలు

04-03-2026 09:29 PM

హోలీ సంబరాల్లో జవహర్ నగర్ కాలనీలు

జవహర్ నగర్,(విజయక్రాంతి): జవహర్ నగర్ ప్రాంతంలో హోలీ పండుగను స్థానికులు ఘనంగా, ఆనందోత్సాహాలతోజరుపుకున్నారు. చిన్నారులు నుంచి పెద్దల వరకు రంగుల వర్షంలో తడిసిముద్దవుతూ “హ్యాపీ హోలీ” శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.

ఉదయం నుంచే యువతులు, యువకులు బృందాలుగా చేరి ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ నృత్యాలు చేశారు. సంప్రదాయ పాటలు, డీజే సంగీతం మధ్య వాతావరణం ఉత్సాహభరితంగా మారింది. మహిళలు ప్రత్యేకంగా తయారు చేసిన పిండివంటలు, స్వీట్లు పంచుకుంటూ పండుగను ఆనందంగా గడిపారు.

పర్యావరణ హిత హోలీకి ప్రాధాన్యత ఇస్తూ సహజ రంగులను మాత్రమే ఉపయోగించాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా స్థానిక పోలీసుల పర్యవేక్షణలో వేడుకలు ప్రశాంతంగా ముగిశాయి. సమాజంలో ఐక్యత, సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలిచే హోలీ పండుగను జవహర్ నగర్ ప్రజలు ఉత్సాహంగాజరుపుకోవడం విశేషంగా నిలిచింది.