4 March, 2026 | 11:37 PM

విశ్వగురు శ్రీశ్రీ విశ్వయోగి విశ్వంజీ మహారాజ్ 82వ జన్మదినోత్సవ వేడుకలు

04-03-2026 09:34 PM

శ్రీ గురు పీఠం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జిన్నారం పెద్దగోని శివకుమార్ గౌడ్

శివంపేట,(విజయక్రాంతి): మెదక్ జిల్లా  శివంపేట మండల కేంద్రం గూడూరు గ్రామంలోని శ్రీ గురు పీఠంలో హైకోర్టు సీనియర్ న్యాయవాది, శ్రీ గురు పీఠం చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ జిన్నారం పెద్దగోని శివకుమార్ గౌడ్ ఆధ్వర్యంలో శ్రీశ్రీశ్రీ విశ్వ యోగి విశ్వంజి మహారాజ్ జన్మదినోత్సవ వేడుకలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు.

ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, స్వామీజీ పాదుకాభిషేకం, అష్టోత్తర అర్చనలు, ప్రత్యేక హారతులు నిర్వహించడం జరుగుతుందని ఇట్టి కార్యక్రమానికి భక్త జనులందరూ హాజరై స్వామీజీ ఆశీస్సులు పొంది ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవించావుతుందని అన్నారు. అనంతరం. అనంతరం వచ్చిన భక్తులకు అన్నప్రసాద విస్తరణ ఉంటుందని జిన్నార పెద్దగోని శివకుమార్ గౌడ్ తెలిపారు.