31 March, 2026 | 3:21 AM

వచ్చే నెలలోనే సెట్స్‌పైకి..

31-03-2026 12:07 AM

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్‌ఖాన్, బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ మేకర్ వంశీ పైడిపల్లి, ప్రముఖ నిర్మాత దిల్ రాజు కలిసి ఓ సినిమా చేయబోతున్నట్టు చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ సోమవారం అధికారికంగా ప్రకటించింది. తాము ఓ హై ఆక్టేన్ యాక్షన్ డ్రామాను చేయబోతున్నట్టు ఈ త్రయం సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలను మేకర్స్ త్వరలోనే తెలియజేయనున్నారు.