18 August, 2026 | 1:16 PM

Breaking News

భూములను భూమాఫీయాకు కట్టబట్టే కుట్ర   •   ఎస్సీ, బీసీల భూములను ప్రభుత్వం లాక్కుంటోంది   •   ప్రభుత్వం తప్పు చేసి.. ప్రజలకు ఎందుకు శిక్ష?   •   ఫర్నిచర్ షాప్‌లో అగ్నిప్రమాదం.. కార్మికుడి సజీవదహణం   •   కస్తూర్బా బాలికల ఆశ్రమ పాఠశాలలో ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆకస్మిక తనిఖీ   •   ఖర్గేను అవమానిస్తారా.. బీజేపీ వైఖరిపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీను బాబు ఫైర్   •   రోడ్డు కోసం పొలం పోతుందని రైతు ఆత్మహత్యాయత్నం   •   గ్రామ గ్రామాన జల సంరక్షణ పనులు చేపట్టండి   •   అక్రమంగా నిల్వ ఉంచిన పిడిఎస్ రైస్ పట్టివేత   •   ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఎంఎంసి కమిషనర్‌కు వినతి   •  

గ్రామ గ్రామాన జల సంరక్షణ పనులు చేపట్టండి

18-08-2026 11:47 AM

బోథ్,(విజయక్రాంతి): ఉపాధి హామీ కార్యక్రమంలో జల సంరక్షణ పనులకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని ఉపాధి హామీ ఎపిఓజగదేరావు పేర్కొన్నారు. నీటి వనరుల పరిరక్షణ కోసం నీటి గుంటలు ప్రతి గ్రామ పంచాయతీకి కనీసం రెండు చొప్పున పూర్తి చేయాలని తెలపడం జరిగిందన్నారు. అంతేగాక ప్రతి రైతు తన పొలంలో బోర్వెల్ రీఛార్జ్ స్ట్రక్చర్ను ఏర్పాటు చేసుకుంటే 36,000 మంజీర అవుతాయన్నారు. ఇంకుడు గుంతలతోపాటు కమ్యూనిటీ ఇంకుడు గుంతలను రైతులు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

అందుకు ప్రభుత్వ పరంగా నిధులు రావడం జరుగుతుందని పేర్కొన్నారు. రైతులు తమ పొలంలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకుంటే ఏడు వేల రూపాయల వరకు ఉపాధి హామీ పథకం కింద మంజూరు అవుతాయన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. నీటి వనరులను పరీక్షించుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర మంచినీటిద్దని తో పాటు సాగునీటి ఎదురవుతుందని ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు నీటి వనరుల పరిరక్షణ కోసం పాటుపడాలన్నారు.