18 August, 2026 | 12:25 PM

Breaking News

ఫర్నిచర్ షాప్‌లో అగ్నిప్రమాదం.. కార్మికుడి సజీవదహణం   •   కస్తూర్బా బాలికల ఆశ్రమ పాఠశాలలో ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆకస్మిక తనిఖీ   •   ఖర్గేను అవమానిస్తారా.. బీజేపీ వైఖరిపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీను బాబు ఫైర్   •   రోడ్డు కోసం పొలం పోతుందని రైతు ఆత్మహత్యాయత్నం   •   గ్రామ గ్రామాన జల సంరక్షణ పనులు చేపట్టండి   •   అక్రమంగా నిల్వ ఉంచిన పిడిఎస్ రైస్ పట్టివేత   •   ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఎంఎంసి కమిషనర్‌కు వినతి   •   ఆర్టీఐ చట్టం సాధన కమిటీ జిల్లా ఉపాధ్యక్షురాలిగా జయకుమారి   •   తహసిల్దార్ కార్యాలయంలో దూరిన పాము   •   కోర్టు ఆదేశాలతో గిరిజన మహిళకు న్యాయం   •  

తహసిల్దార్ కార్యాలయంలో దూరిన పాము

18-08-2026 11:29 AM

పరుగులు తీసిన అధికారులు, సిబ్బంది

స్నేక్ క్యాచర్ వచ్చి పామును పట్టుకోవడంతో ఊపిరి పీల్చుకున్న సిబ్బంది 

గిర్ధావర్‌ గదిలో పాము.. భయాందోళనకు గురైన సిబ్బంది 

కుభీర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా మండల కేంద్రం కుభీర్ తహసీల్దార్ కార్యాలయంలోని గిర్ధావర్ గదిలోకి పాము దూరడంతో సిబ్బంది ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో పాము కనిపించడంతో ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు. ఆందోళన గురయ్యారు.  వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించగా, భైంసా నుండి అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ పామును సురక్షితంగా పట్టుకున్నారు.

దీంతో తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. సుమారు గంటన్నర పాటు గందరగోళ పరిస్థితి ఏర్పడింది. నాగుల పంచమి రోజైనా సోమవారం కార్యాలయంలో పాము ప్రత్యక్షం కావడంతో అధికారులు సిబ్బంది వివిధ పనుల నిమిత్తం వచ్చిన ఆయా గ్రామాల ప్రజలు పామును దర్శించుకుని దర్శించుకున్నారు. పాము అటవీ ప్రాంతంలో వదిలేయనున్నట్టు స్నేక్ క్యాచర్ తెలిపారు.