కోర్టు ఆదేశాలతో గిరిజన మహిళకు న్యాయం
గిరిజన మహిళలకు 3 ఎకరాల భూమి అప్పగింత
తహసిల్దార్, సిఐ ఆధ్వర్యంలో భూమి హద్దులతో పంచనామ
కారేపల్లి: ఉసిరికాయలపల్లి రెవెన్యూ గ్రామంలో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న భూ వివాదానికి కోర్టు ఆదేశాలతో తెరపడింది. సింగరేణి మండలం ఉసిరికాయలపల్లి గ్రామంలో సర్వే నంబర్ 548/37/5/4లోని 3 ఎకరాల భూమిని గిరిజన మహిళ బానోతు లక్ష్మికి రెవెన్యూ, పోలీస్, సర్వే శాఖల అధికారులు సమక్షంలో అప్పగించారు. కోర్టు ఆదేశాల మేరకు తహసిల్దార్ వెంకటేశ్వర్లు, రెవెన్యూ అధికారులు గ్రామానికి చేరుకుని భూమిని సర్వే చేసి హద్దులు నిర్ణయించారు. అనంతరం బాధితురాలికి భూమి అప్పగించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
పోలీసుల భారీ బందోబస్తు
భూమి విషయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా సీఐ సాగర్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అధికారులు సమస్యను శాంతియుతంగా పరిష్కరించి, కోర్టు ఆదేశాలను అమలు చేశారు. సింగరేణి మండలంలోని ఉసిరికాయలపల్లి గ్రామంలో సర్వే నంబర్ 548/37/5/4లో ఉన్న భూమిపై చాలాకాలంగా వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు సంబంధిత రెవెన్యూ, పోలీస్, సర్వే శాఖల అధికారులు మంగళవారం గ్రామానికి చేరుకున్నారు. భూమిని పరిశీలించి, సర్వే నిర్వహించి హద్దులను గుర్తించారు.
అధికారుల సమక్షంలో 3 ఎకరాల భూమిని గిరిజన మహిళ బానోతు లక్ష్మికి అప్పగించారు. ఈ సందర్భంగా పోలీసులు ముందస్తు జాగ్రత్తగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అధికారులు మాట్లాడుతూ కోర్టు ఆదేశాలను అమలు చేయడమే తమ బాధ్యత అని తెలిపారు. భూమి తమకు దక్కడంతో బానోతు లక్ష్మి కుటుంబ సభ్యులు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నాళ్లుగా కొనసాగుతున్న సమస్య పరిష్కారం కావడంతో గ్రామంలో సంతృప్తి వ్యక్తమైంది.






