అక్రమంగా నిల్వ ఉంచిన పిడిఎస్ రైస్ పట్టివేత
18-08-2026 11:45 AM
చందుర్తి,(విజయక్రాంతి): మండలంలోని మల్యాల గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన పిడిఎస్ రైస్ ను పోలీసులు పట్టుకున్నారు. మల్యాల గ్రామంలో పాత ఇనుప సామాను అమ్ముతూ,కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న భోజ సంపత్ (తండ్రి మల్లయ్య ), అను అతను గొంతి ప్రశాంత్ (తండ్రి రాజయ్య) ఇంట్లో నిలువ ఉంచి అక్రమ పిడిఎస్ బియ్యం బస్తాలను దాదాపు 12 క్వింటాళ్లు, ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్టు సమాచారం అందడంతో పోలీసులు విచారణ చేపట్టి విక్రయాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.






