పెట్రోల్,డీజిల్ ధరలు పెంచడం..పేద ప్రజల నడ్డి విరవడమే
16-05-2026 01:22 PM
ఏఎంసీ మాజీ డైరెక్టర్ ముస్తఫా.
తాండూరు, మే 16,(విజయ క్రాంతి): పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల నడ్డి విరుస్తుందని వికారాబాద్ జిల్లా తాండూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ ముస్తఫా ఆరోపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓవైపు పొదుపు మంత్రం జపిస్తూనే... మరోవైపు ఇంధనం ధరలు పెంచడంతో నిత్యవసర సరుకుల రవాణా భారం అమాంతంగా పెరిగి ఆ భారం పేద ప్రజలపై మోపడం సమంజసం కాదని ఆయన అన్నారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై పెంచిన ధరలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.






