భీక్యాతండ గ్రామంలో హైమాస్ట్ లైట్లు ప్రారంభం
06-06-2026 07:44 PM
సర్పంచ్ బాణోతు ఝాన్సీ బాలాజీ
కోదాడ,(విజయక్రాంతి): భీక్యాతండ గ్రామంలో డబుల్ బెడ్ రూం సెంటర్, పంతులునాయక్ తండాలో శనివారం హైమాస్ట్ లైట్లను సర్పంచ్ బాణోతు ఝాన్సీ బాలాజీ ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్యే నలమాద పద్మావతి రెడ్డి సహకారంతో హై మాస్ట్ లైట్లను ఏర్పాటుచేయించినట్లు తెలిపారు. ఎమ్మెల్యే నలమాద పద్మావతి రెడ్డి ప్రత్యేకంగా గ్రామాన్ని గుర్తించి, గతంలో ఏ ప్రభుత్వం చేయని విధముగా ఎమ్మెల్యే నలమాద పద్మావతి రెడ్డి సహకారంతో రెండు చోట్ల హైమాస్ట్ లైట్లు పెట్టించడానికి సహకరించడం పట్ల గ్రామం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో ఉపసర్పంచి గుగులోతు బుజ్జి, వార్డు నెంబర్లు,గ్రామస్తులు, యూత్ పాల్గొన్నారు






