21 May, 2026 | 2:42 AM

పటాన్‌చెరు తొంబ్స్ వద్ద హెరిటేజ్ వాక్ నిర్వహణ

21-05-2026 01:22 AM

పటాన్చెరు, మే 20 : ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న 99 రోజుల కార్యక్రమాల్లో టూరిజం వారోత్సవం  సందర్భంగా బుధవారం పటాన్చెరు తొంబ్స్ వద్ద హెరిటేజ్ వాక్ కార్యక్రమాన్ని జిల్లా టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా టూరిజం శాఖ అధికారి అఖిలేష్ రెడ్డి, విద్యార్థులు, యువత, మున్సిపల్ అధికారులు, టూరిజం శాఖ సిబ్బంది, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా టూరిజం శాఖ అధికారి అఖిలేష్ రెడ్డి మాట్లాడుతూ, జిల్లాలో ఉన్న చారిత్రక, సాంస్కృతిక వారసత్వ కట్టడాలను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. పటాన్చెరు తొంబ్స్ ప్రాంత చరిత్రకు ప్రతీకలుగా నిలుస్తున్నాయని, యువతలో వారసత్వ సంపదపై అవగాహన పెంపొందించేందుకు హెరిటేజ్ వాక్లు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. టూరిజం వీక్లో భాగంగా జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు చారిత్రక ప్రదేశాల ప్రాముఖ్యతను తెలియజేసే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. విద్యార్థులు, యువత చరిత్రను తెలుసుకొని వారసత్వ సంపద పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.