21 May, 2026 | 2:43 AM

సినీ ఫక్కీలో 1.5 లక్షల నగదు చోరీ

21-05-2026 01:22 AM

బ్యాంకు వద్ద - బైకు అడ్డంపెట్టి ఎత్తుకెళ్లిన దుండగులు

నల్లగొండ జిల్లా కేంద్రంలో ఘటన

నల్లగొండ క్రైం, మే 20: సినీ ఫక్కీలో ముగ్గురు దుండగులు యూనియన్ బ్యాంకు వద్ద బైక్ ముందు కవర్‌లో పెట్టుకున్న రూ. 1.5 లక్షల నగదును చోరీ చేశారు. వన్ టౌన్ ఎస్సై సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండలోని యూనియన్ బ్యాంక్ నుంచి బాధితుడు రూ.1.5 లక్షలు డ్రా చేసి తీసుకొని బ్యాంక్ ముందర తన బైక్ ట్యాంక్ కవర్‌లో పెట్టుకొని బయలుదేరుతున్నాడన్నారు.

సరిగ్గా అదే సమయానికి బైకుకు మరొక బైకును ముగ్గురు దుండగులు అడ్డుగా పెట్టారు. తన బైక్‌ను బాధితుడు పక్కకు తీస్తుండగా అదే అదునుగా దుండగులు బాధితుడి బైక్ ట్యాంక్ కవర్‌లో ఉన్న నగదును దొంగలించి అక్కడ నుండి తమ రెండు బైక్‌లపై పరారయ్యారు. నిందితుల కదలికలు సిసి కెమెరాలో రికార్డ్ కావడంతో ఆ వీడియోలను పోలీసులు విడుదల చేశారు. గుర్తించిన వారు సమాచారం ఇవ్వాలన్నారు.