21 May, 2026 | 2:36 AM

కూలీలు తగ్గకుండా చూసుకోవాలి

21-05-2026 01:23 AM

కోహెడ, మే 20: ఉపాధి హామీ పనులలో కూలీలు తగ్గకుండా చూసుకోవాలని ఎంపీడీఓ కృష్ణయ్య అన్నారు. బుధవారం వింజపల్లి, రాంచంద్రాపూరం, వరికోలు గ్రామాలలో జరుగుతున్న ఎన్‌ఆర్‌ఈజీఎస్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. సమయపాలన ద్వారా కూలీలతో పనులను చేపించాలని అయా గ్రామాల ఫీల్ అసిస్టెంట్ లను ఆదేశించారు.  ఎండలు ఎక్కువగా ఉండడం వలన ఉదయం ఆరు గంటలకే పనులకు త్వరగా రావాలని కూలీలకు సూచించారు.

పనిచేసిన వారికి వెంటనే కూలీ డబ్బులు కూడా వ్యక్తి గత బ్యాంక్ ఖాతాలో పడుతున్నాయని వారికి వివరించారు. హాజరు రికార్డ్ ను తనిఖీ చేశారు. పని జరుగుతున్న ప్రదేశంలో తప్పనిసరిగా ప్రతిరోజు త్రాగునీరు, సేడ్ నెట్ ORS ప్యాకెట్లు ఉండే విధంగా చూడాలని.. ప్రతి జిపి నుంచి 150 కి తగ్గకుండా కూలీలు వచ్చే విధంగా ఉండాలని ఆయా గ్రామ పంచాయతీ కార్యదర్శులకు, ఫీల్ అసిస్టెంట్, మెట్ లకు సూచించారు. మండల వ్యాప్తంగా బుధవారం 2557 మంది కూలీలు  పనికి హాజరైనట్లు చెప్పారు. అన్ని గ్రామంలో ఉపాధి పనులు చురుకుగా సాగుతున్నయన్నారు. ఈ కార్యక్రమంలో శోభ, సుదీర్ పాల్గొన్నారు.