13 July, 2026 | 5:10 PM

Breaking News

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో బెల్లంపల్లి క్రీడాకారులకు పతకాలు   •   బంజారా కమ్యూనిటీ హాల్‌కు స్థలం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు వినతి   •   విద్యార్థుల ఆరోగ్యానికి భద్రత   •   ప్రాథమిక విద్యను మరింత బలోపేతం చేయాలి – జిల్లా కలెక్టర్ కె. హరిత   •   ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవడం ద్వారా నులిపురుగులను నివారించవచ్చు   •   విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ   •   ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ కె.హరిత   •   కాంగ్రెస్ పార్టీలో 'జక్కిడి' మంటలు   •   లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల మంజూరు పత్రలు అందజేత   •   ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ   •  

విద్యార్థులకు చేయూత

25-11-2025 06:38 PM

కుబీర్ (విజయక్రాంతి): కుబీర్ మండలంలోని అంతర్నీ పాఠశాలలో చదివిన తన మనవడు నేవీలో ఉద్యోగం సాధించడంతో అతని నానమ్మ అంజనమ్మ మంగళవారం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు బ్యాగులు పంపిణీ చేశారు. ఊరి పాఠశాలలో చదివిన తన మనవడు పూజేకర్ శ్రీకాంత్ అగ్నివీర్(Agniveer)లో ఎంపికై భారత సైన్యంలో(నేవీ) పని చేస్తున్నారు. అతని సహకార మేరకు మంగళవారం పాఠశాల విద్యార్థులకు 6000 పుస్తకాలను అందించారు. తన వంతు సహాయంగా సుమారు ₹6,000 విలువైన పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, పెన్నులను విద్యార్థులకు అందజేశారు. పేద కుటుంబం నుండి వచ్చిన తన మన్మడు స్ఫూర్తిగా తీసుకొని, విద్యార్థులు లక్ష్యాలను ఏర్పరచుకుని బాగా చదివి, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తేవాలని ఆమె ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుభాష్, ఉపాధ్యాయులు కత్తి నాగారావు, పోషకులు, విద్యార్థులు పాల్గొన్నారు.