తొలిముద్ద కార్యక్రమంతో పసిపిల్లలకు ఆరోగ్యం
19-07-2026 02:30 PM
బోథ్, జూలై 19 (విజయ క్రాంతి) : ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా అమ్మ చేతి తొలిముద్ద కార్యక్రమాన్ని అమలు చేయడం వల్ల పసిపిల్లలకు పౌష్టికాహారం అందడంతో పాటు ఆరోగ్యంగా ఉంటారని పలువురు వార్డు సభ్యులు పేర్కొన్నారు.ఆదివారం మండల కేంద్రంలోని ఆరవ అంగన్వాడీ కేంద్రంలో కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా వార్డు సభ్యులు వారే ఐశ్వర్య ,కటుకూరి సాయి కలిపే శ్రీనివాస్ కట్ట భూమేష్లు పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు తొలి ముద్ద వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు . అంగన్వాడి కేంద్రాలు పరిశుభ్రంగా ఉంచాలని విద్యార్థులకు ఇబ్బందులు కలగ కుండ కేంద్రాల నిర్వహణ ఉండాలన్నారు. కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ వసంత, ఏఎన్ఎం ఆశ వర్కర్ లు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.






