విశ్వంభర సౌండ్ మొదలైంది!
చిరంజీవి నటిస్తున్న మరో సోషియో- ఫాంటసీ ‘విశ్వంభర’. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుది దశకు చేరుకున్నాయి. ప్రముఖ స్టూడియోలు వీఎఫ్‌ఎక్స్ పనులను పూర్తి చేస్తున్నాయి. వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్‌తోపాటు ఒరిజినల్ సౌండ్‌ట్రాక్‌ను విడుదల చేశారు.
తాజా పోస్టర్ లో చిరంజీవి ఫెరోషియస్ లుక్ ఆకట్టుకుంటోంది. ఇంటెన్స్‌లుక్, స్క్రీన్ ప్రెజెన్స్‌ను మెటాలిక్ త్రిశూలం మరింత పవర్‌ను తీసుకొచ్చింది. మరోవైపు సెన్సేషనల్ కంపోజర్ గౌరహరి అందించిన ఓఎస్‌టీ పోస్టర్‌కు మరింత ఇంటెన్సిటీని జోడించింది.
ఈ చిత్రంలో త్రిష కృష్ణ న్, ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్ కీలక పాత్రల్లో నటిస్తుండగా, మౌనీ రాయ్ ప్రత్యేక గీతంలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ఛోటా కే నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, ఏఎస్ ప్రకాశ్ ప్రొడక్షన్ డిజైన్ చేస్తున్నారు. కీరవాణి పాటలకు సంగీతం అందిస్తుండగా, భీమ్స్ సిసిరోలియో ఓ డ్యాన్స్ నంబర్‌కు స్వరాలు సమకూర్చారు. గౌరహరి నేపథ్య సంగీతాన్ని అందిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ‘విశ్వంభర’ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ సినిమా విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు.






