4 July, 2026 | 11:18 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

కేసీఆర్ నాయకత్వంలోనే అన్ని వర్గాల అభివృద్ధి

12-03-2026 11:37 AM

సోదర భావానికి ప్రతీక ఇఫ్తార్ విందు

ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే జిఎంఆర్

అమీన్ పూర్: పటాన్‌ చెరు నియోజకవర్గంలోని కొల్లూరు డబుల్ బెడ్ రూమ్ ప్రాంతంలో నిర్వహించిన ఇఫ్తార్ విందు, మహిళా దినోత్సవ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పటాన్‌ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, నియోజకవర్గం ఇంచార్జ్ ఆదర్శ్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ఐలాపూర్ మాణిక్ యాదవ్  పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు  మాట్లాడుతు... కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధి కోసం పనిచేసిందని తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆశలను నెరవేర్చడంలో విఫలమైందని విమర్శించారు. రంజాన్ మాసం ప్రేమ, సోదర భావానికి ప్రతీక అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి  మాట్లాడుతూ... కేసీఆర్ దూరదృష్టి నాయకత్వంతో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగిందని, ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేశారని తెలిపారు.

నియోజకవర్గం ఇంచార్జ్ ఆదర్శ్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ ప్రజల పక్షాన నిలిచే పార్టీ అని, ప్రజల సంక్షేమమే పార్టీ లక్ష్యమన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ యువ  నాయకులు ఐలాపూర్ మాణిక్ యాదవ్  మాట్లాడుతూ... బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల కోసం పనిచేసే పార్టీ అని, కేసీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లే బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సోమి రెడ్డి, మెట్టు కుమార్ యాదవ్, ఎర్రోళ శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి, తొంట అంజయ్య, గడిల శ్రీకాంత్, తెలంగాణ ఉద్యమ నాయకుడు వెంకటేష్ గౌడ్ పాల్గొన్నారు.