13 August, 2026 | 6:53 PM

అనారోగ్యంతో ఉన్న హనుమాన్‌రెడ్డికి ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ పరామర్శ

12-08-2026 03:42 PM

అంతర్గాం,(విజయక్రాంతి): అనారోగ్యంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హనుమాన్‌రెడ్డిని రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్‌ఠాకూర్ దంపతులు పరామర్శించారు. బుధవారం గోలివాడలోని హనుమాన్‌రెడ్డి నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యే దంపతులు ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  రాజ్‌ఠాకూర్ మాట్లాడుతూ హనుమాన్‌రెడ్డి త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. అనారోగ్య పరిస్థితుల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలకు అండగా నిలుస్తూ ఎమ్మెల్యే పరామర్శించడం పట్ల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.